కర్బన ఉద్గారాలను పీల్చుకునే ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ కార్యక్రమం (టీఎఫ్‌ఎఫ్‌ఎఫ్)లో భారత్ పరిశీలకురాలి హోదాలో చేరింది. బ్రెజిల్ 12,500 కోట్ల డాలర్ల టీఎఫ్‌ఎఫ్‌ఎఫ్ నిధిని ప్రారంభించింది. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఈ కార్యక్రమానికి నిధులు సమకూరుస్తాయి. అడవులను సమర్థంగా పరిరక్షిస్తున్న దేశాలకు ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.