Published on Mar 22, 2025
Current Affairs
అంతర్జాతీయ అటవీ దినోత్సవం
అంతర్జాతీయ అటవీ దినోత్సవం

అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏటా మార్చి 21న నిర్వహిస్తారు. దట్టమైన వృక్షాలు, పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులుగా పేర్కొంటారు.

ఇవి అనేక జీవజాతులకు ఆవాసాలుగా ఉంటాయి. జీవవైవిధ్యం, పర్యావరణ సమతౌల్యతను కాపాడటంలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి.

అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం, వాటి నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

2012, నవంబరు 28న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించింది.

2025 అంతర్జాతీయ అటవీ దినోత్సవ నినాదం (థీమ్‌): అడవులు, ఆహారం (Forests and Food)