Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 31, 2026
Current Affairs
అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం
అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం
  • అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 27న ‘అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం’గా (International Day Of Epidemic Preparedness) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల నివారణ, సంసిద్ధత, సహకారాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, ఒక సమాజంలో లేదా ప్రాంతంలో అనారోగ్య సంఘటనలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడాన్ని అంటువ్యాధిగా పేర్కొంటారు. ఇవి ఒక నిర్దిష్ట కాలపరిమితిలో సంభవిస్తాయి. రుగ్మత కారకం, దీనికి గురైన జనాభా పరిమాణం, రకం, గతంలో ఆ వ్యాధికి గురికావడం, ప్రదేశం లాంటి అనేక కారకాలు అంటువ్యాధుల ఉనికిని సూచించే కేసుల సంఖ్యను ప్రభావితం చేస్తాయి. 
  • చారిత్రక నేపథ్యం
  • అంటువ్యాధులకు సంసిద్ధత, నివారణ, వాటికి వ్యతిరేకంగా ప్రజలు - ప్రభుత్వాలు - దేశాల భాగస్వామ్యానికి ఉన్న ప్రాముఖ్యతను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి, అంటువ్యాధుల నిర్వహణపై అవగాహన కోసం ఒక రోజును ఏర్పాటు చేయాలని భావించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబరు 27న ‘అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం’గా జరుపుకోవాలని 2020లో తీర్మానించింది. నాటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.