Published on Sep 13, 2024
Current Affairs
అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌
అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌ను నిర్వహించింది. ‘పొలారిస్‌ డాన్‌’ ప్రాజెక్టు కింద ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా సెప్టెంబరు 10న నలుగురు అంతరిక్షంలోకి వెళ్లారు. వారిలో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జేర్డ్‌ ఇస్సాక్‌మన్‌ సెప్టెంబరు 12న తొలుత క్యాప్సుల్‌ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్‌ నిర్వహించారు.

* ప్రొఫెషనల్‌ వ్యోమగాములు కాకుండా,  అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.