Published on Dec 19, 2024
Current Affairs
అంతరిక్షంలో చైనా కొత్త రికార్డు
అంతరిక్షంలో చైనా కొత్త రికార్డు

అంతరిక్ష పరిశోధనల్లో చైనా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ దేశ వ్యోమగాములు కై షూఝె, సాంగ్‌ లింగ్‌డాంగ్‌లు 9 గంటలపాటు సుదీర్ఘంగా స్పేస్‌వాక్‌ చేసి చరిత్ర సృష్టించారు. వీరు షెంఝూ-19 అనే అంతరిక్ష నౌకా బృందంలో సభ్యులు. చైనాలో తయారుచేసిన ఫెయిటియాన్‌ రెండోతరం స్పేస్‌ సూట్లను వీరు ధరించారు. చైనాకు చెందిన తియాంగాంగ్‌ స్పేస్‌ సెంటర్‌ రోబోటిక్‌ కెమెరా వీరి స్పేస్‌వాక్‌ను చిత్రీకరించి బీజింగ్‌ ఏరోస్పేస్‌ నియంత్రణ కేంద్రానికి పంపింది.

2001 మార్చి 12న అమెరికా వ్యోమగాములు జేమ్స్‌ వూస్, సుసాన్‌ హల్మ్స్‌లు 8.56 గంటలు స్పేస్‌వాక్‌ చేయగా దీనిని చైనా వ్యోమగాములు అధిగమించారు.