Published on Apr 19, 2025
Current Affairs
అంతరిక్షయాత్రకు నీటి ఎలుగు
అంతరిక్షయాత్రకు నీటి ఎలుగు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన యాక్సియమ్‌ స్పేస్, స్పేస్‌ ఎక్స్‌లు కలిసి 2025, మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోకి పంపించే యాక్సియమ్‌ మిషన్‌-4(ఏఎక్స్‌-4)లో వ్యోమగాములతో పాటు భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి (టార్డిగ్రేడ్‌) కూడా వెళ్లనుంది. యాక్సియమ్‌ మిషన్‌ను ప్రైవేట్‌ వ్యోమనౌక క్రూడ్రాగన్‌ జీ213 ద్వారా పంపించనున్నారు. మొత్తం 14-21 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండే ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములుంటారు. ఇందులో భారతీయ వైమానిక దళం టెస్ట్‌ పైలట్‌ గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా కూడా ఒకరు.