2024-25 ఆర్థిక సంవత్సరానికి అత్యధిక ఎగుమతులు సాధించిన రాష్ట్రాల జాబితాను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో, తెలంగాణ 7వ స్థానంలో నిలిచాయి. ఎన్నో ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాలో వ్యవసాయ ఉత్పత్తులు ముందుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ‘మ్యాన్‌ఫ్యాక్చర్డ్ గూడ్స్’ ఎగుమతులు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ ఉత్పత్తుల విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.