Published on Mar 27, 2025
Current Affairs
అత్యంత విలువైన ఉక్కు కంపెనీ
అత్యంత విలువైన ఉక్కు కంపెనీ

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా సజ్జన్‌ జిందాల్‌ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నిలిచింది.

ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2.58 లక్షల కోట్లు (30 బిలియన్‌ డాలర్లు)గా ఉంది.

తద్వారా మార్కెట్‌ విలువలో ఆర్సెలర్‌ మిత్తల్‌ (24.79 బి.డా/రూ.2.13 లక్షల కోట్లు), నిప్పన్‌ స్టీల్‌ (23.08 బి.డా./రూ.1.98 లక్షల కోట్లు) లాంటి అంతర్జాతీయ సంస్థలను, దేశీయంగా టాటా స్టీల్‌ (రూ.1.95 లక్షల కోట్ల), సెయిల్‌ (సుమారు రూ.47,000 కోట్ల)ను అధిగమించింది.