2024 సంవత్సరానికి అత్యుత్తమ భారత బ్యాంక్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎంపికైంది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 31వ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డుల్లో ఎస్‌బీఐ ఈ ఘనత సాధించింది.
వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. అత్యుత్తమ భారత బ్యాంక్ అవార్డును ఎస్‌బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అందుకున్నారు.