దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) అవతరించనుంది.
గ్రామీణ బ్యాంకులను పటిష్ఠపరిచేలా కేంద్రం తీసుకున్న ‘ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు’ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ)కు చెందిన తెలంగాణలోని శాఖలన్నీ ఇకపై టీజీబీలో విలీనం కానున్నాయి.
జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని 2024, డిసెంబరు 26న టీజీబీ ఛైర్మన్ వై.శోభ వెల్లడించారు.
ప్రస్తుతం ఏపీజీవీబీ తెలుగు రాష్ట్రాల్లో 771 శాఖలతో సేవలందిస్తోంది. దీనికి తెలంగాణలో ఉన్న 493 శాఖలు టీజీబీలో విలీనమవుతాయి.