Published on Oct 27, 2025
Current Affairs
అణుశక్తితో నడిచే క్రూజ్‌ క్షిపణి
అణుశక్తితో నడిచే క్రూజ్‌ క్షిపణి

ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో నడిచే క్రూజ్‌ క్షిపణి ‘బురెవెస్ట్‌నిక్‌’ని రష్యా సిద్ధం చేసింది. గాల్లో ‘అపరిమిత’ సమయం పాటు ఇది సంచరించగలదు. రష్యా సైన్యం ఇటీవల ‘అణు’ విన్యాసాలు నిర్వహించింది. పరీక్షల సమయంలో ‘బురెవెస్ట్‌నిక్‌’ 15 గంటల పాటు గాల్లోనే ఉందని, 14వేల కిలోమీటర్లు ప్రయాణించిందని రష్యా తెలిపింది. అయితే ఇదే దీని గరిష్ఠ సామర్థ్యం కాదని, సైద్ధాంతికంగా దీని పరిధి అపరిమితమన్నారు. 

బురెవెస్ట్‌నిక్‌ సాంకేతిక సామర్థ్యాల దృష్ట్యా.. అత్యంత కచ్చితత్వంతో ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా ఛేదించొచ్చని రష్యా సైన్యంలోని చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వారెలీ గెరాసిమోవ్‌ పేర్కొన్నారు. ఇటీవలి పరీక్షలో ఈ అస్త్రం.. 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో విహరించింది.