అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ (65కేజీ) స్వర్ణ పతకం గెలిచాడు. 2025, అక్టోబరు 27న నోవి సాద్ (సెర్బియా)లో జరిగిన ఫైనల్లో అతడు 10-0తో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఉమిద్‌జోన్ జలలోవ్‌పై విజయం సాధించాడు. సుజీత్ గతంలో ఎప్పుడూ ప్రపంచ టైటిల్ గెలవలేదు. కానీ రెండు అండర్-23 ఆసియా టైటిళ్లు (2022, 2025), ఒక అండర్-20 ఆసియా ఛాంపియన్‌షిప్ (2022) టైటిల్ సాధించాడు. 2024లో జరిగిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సుజీత్ కాంస్యం గెలుచుకున్నాడు.