అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో చిరాగ్ చిక్కారా స్వర్ణం నెగ్గాడు. 2024, అక్టోబరు 28న టిరానా (అల్బేనియా)లో జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం ఫైనల్లో అతడు 4-3తో అబ్దిమాలిక్ కరాచోవ్ (కిర్గిస్థాన్)పై నెగ్గాడు.
అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అమన్ సెహ్రావత్ తర్వాత స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్ చిరాగే. 2022లో అమన్ ఈ ఘనత సాధించాడు.