అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి క్రిషావర్మ స్వర్ణం నెగ్గింది. 2024, నవంబరు 2న కొలరాడో, అమెరికాలో జరిగిన మహిళల 75 కేజీల విభాగం తుదిపోరులో ఆమె 5-0తో సిమోన్ లెరికా (జర్మనీ)ని ఓడించింది.
* మరోవైపు భారత్ ఖాతాలో అయిదు రజతాలు చేరాయి. మహిళల్లో చంచల్ చౌదరి (48 కేజీ), అంజలి కుమారి (57 కేజీ), విని (60 కేజీ), ఆకాంశ (70 కేజీ).. పురుషుల్లో రాహుల్ కుందు (75 కేజీ) ఫైనల్లో ఓడి రెండో స్థానంలో నిలిచారు.