Published on Oct 11, 2024
Admissions
అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌(యూసీడ్‌) 2025
అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌(యూసీడ్‌) 2025

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీబీ) బాంబే- డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌(యూసీడ్‌) 2025’ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ (హైదరాబాద్‌, బాంబే, దిల్లీ, గువాహటి, రూర్కీ), ఐఐఐటీడీఎం(జబల్పూర్‌) సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో బీడిజైన్‌ కోర్సు చేసే అవకాశం ఉంటుంది.

వివరాలు:

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌(యూసీడ్‌) 2025

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ లేదా పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపీసీ గ్రూప్‌ చదివినవారుపై 5 విద్యాసంస్థల్లో చేరొచ్చు. ఐఐఐటీడీఎంలో ప్రవేశానికి బైపీసీ అభ్యర్థులు కూడా అర్హులే. బైపీసీ సహా ఆర్ట్స్‌, కామర్స్‌ గ్రూప్‌లు చదివినవారు ఐఐటీ (హైదరాబాద్‌, బాంబే, దిల్లీ)లో చేరవచ్చు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వహించే రెండేళ్ల జాయింట్‌ సర్వీసెస్‌ వింగ్‌ కోర్సు పూర్తిచేసినవారు; నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) నిర్వహించే సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులు కూడా అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయో పరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01-10-2000న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 31, 2024.

ఆలస్య రుసుంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 8, 2024.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: జనవరి 3, 2025.

పరీక్ష తేదీ: జనవరి 19, 2025.

ఫలితాల ప్రకటన: మార్చి 07, 2025.

Website:https://www.uceed.iitb.ac.in/2025/

Apply online:https://uceedapp.iitb.ac.in/UCEED/home.jsp