ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు చెందిన అడ్రియన్ కర్మాకర్ రజతం నెగ్గాడు.
2025, మే 20న షల్ (జర్మనీ)లో జరిగిన 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ ఫైనల్లో అతడు 626.7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు.
0.3 పాయింట్ల తేడాతో అతడు స్వర్ణాన్ని కోల్పోయాడు.
జెస్పర్ జొనాసన్ (స్వీడన్, 626.37) స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు.
గ్రిఫిన్ లేక్ (అమెరికా, 624.6)కు కాంస్యం దక్కింది.