Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 29, 2026
Current Affairs
అజిత్‌ పవార్‌ దుర్మరణం
అజిత్‌ పవార్‌ దుర్మరణం
  • మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ (66) 2026, జనవరి 28న దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు మరో నలుగురు చనిపోయారు. బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన లీర్‌జెట్‌ 45 విమానం అజిత్‌ పవార్‌ను తీసుకుని ముంబయి నుంచి బయలుదేరింది. అది బారామతికి చేరుకున్నాక విమానం రన్‌వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. 
  • 1959, జులై 22న అజిత్‌ పవార్‌ జన్మించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌పవార్‌ ఆయనకు బాబాయి. ఆరుసార్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టి అజిత్‌ పవార్‌ రికార్డు సృష్టించారు. 
  • అజిత్‌ పవార్‌ 2023 జులైలో తన చిన్నాన్న, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌పై తిరుగుబాటు చేశారు. తదనంతర పరిణామాల్లో పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం కూడా అజిత్‌ వశమయ్యాయి.