అణుశక్తి కమిషన్ ఛైర్మన్‌గా, అణుశక్తిశాఖ (డీఏఈ) కార్యదర్శిగా ప్రముఖ భౌతికశాస్త్రవేత్త అజిత్‌కుమార్ మొహంతి పదవీ కాలాన్ని మరో ఆరునెలల పాటు పొడిగించినట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది.
కేంద్ర మంత్రి మండలికి చెందిన నియామకాల కమిటీ ఈ పొడిగింపును ఆమోదించింది.
2025, సెప్టెంబరులో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.