నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అంగోలా అధ్యక్షుడు జువా మనువెల్ గొంజాల్వెజ్ లౌరెన్సాతో 2025, మే 3న ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పహల్గాం ఉగ్రదాడి అంశంపైనా ఇరువురు నేతలు చర్చించారు. అంగోలా సైన్యం ఆధునికీకరణకు 20 కోట్ల డాలర్ల రుణాన్ని అందిస్తున్నట్లు మోదీ ప్రకటించారు.