ప్రపంచంలోనే అత్యధికంగా అగరబత్తీలను తయారు చేస్తూ, ఎగుమతి చేస్తున్న మన దేశంలో, వీటి నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం నూతన నిబంధనలు జారీ చేసింది. ఇందుకోసం భారత ప్రమాణాల మండలి (బీఐఎస్) మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రస్తుతం దేశీయ అగరబత్తీల వ్యాపార పరిమాణం సుమారు రూ.8,000 కోట్లుగా ఉంది. వినియోగదారు ఆరోగ్య భద్రత, అగరుబత్తీలు వెలిగించే గదిలో వాయు నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ నిబంధనలు, కొన్ని రకాల సువాసన ఉత్పత్తులు, రసాయనాలపై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని.. అగరబత్తీల కోసం ప్రత్యేకంగా ‘ఐఎస్ 19412:2025’ ప్రమాణాలను రూపొందించారు.