Published on Nov 15, 2025
Current Affairs
అంగారకుడి శోధనకు ‘ఎస్కపేడ్‌’
అంగారకుడి శోధనకు ‘ఎస్కపేడ్‌’
  • అంగారక గ్రహం గురించి లోతుగా శోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఎస్కపేడ్‌’ ప్రయోగం విజయవంతమైంది. అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆర్జిన్‌’కు చెందిన భారీ న్యూగ్లెన్‌ రాకెట్‌.. ఈ వ్యోమనౌకను నింగిలో ప్రవేశపెట్టింది. ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదికైంది. 
  • ‘ఎస్కపేడ్‌’ మిషన్‌లో బ్లూ, గోల్డ్‌ అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి అంగారకుడి వాతావరణాన్ని పరిశీలించనున్నాయి. అరుణగ్రహం తన వాతావరణాన్ని కోల్పోయిన తీరును ఇవి శోధించనున్నాయి. అంగారకుడి నివాసయోగ్యతకు సంబంధించి అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఆ గ్రహ అయస్కాంత క్షేత్రం, ప్లాస్మా వాతావరణాన్ని శోధించనున్నాయి.