Published on Feb 27, 2025
Current Affairs
అంగారకుడిపై 300 కోట్ల ఏళ్లనాటి బీచ్‌
అంగారకుడిపై 300 కోట్ల ఏళ్లనాటి బీచ్‌

అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ అందించిన డేటా ఆధారంగా వారు ఈ ఆవిష్కారం చేశారు.

అరుణగ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించిందని 1970లలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసాకు చెందిన మెరైనర్‌-9 వ్యోమనౌక అందించిన చిత్రాల్లో వెల్లడైంది. 

ఆ గ్రహంపై 450 కోట్ల ఏళ్ల కిందటే నీరు ఉండేదనడానికి అంగారకుడి నుంచి వచ్చిపడ్డ ఉల్కల్లో ఆధారాలు లభ్యమయ్యాయి.

గత కొన్నేళ్లలో అంతరిక్ష శిలల ఢీ వల్ల అక్కడ ఏర్పడ్డ బిలాల్లోని ఉపరితలం కింద ఐస్‌ ఉన్నట్లు కూడా తేలింది.