రాబోయే నాలుగు దశాబ్దాల్లో అంగారక గ్రహంపై 3డీ ముద్రిత నివాసాలను ఏర్పాటు చేయాలని, మానవులను తీసుకెళ్లడానికి ముందస్తు యంత్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన రోడ్‌మ్యాప్‌ను అనుసరించనుంది.
ఈ రోడ్‌మ్యాప్‌ను ఇటీవల జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇస్రో దేశవ్యాప్తంగా సంప్రందింపులు జరిపి రూపొందించింది.
ఈ రోడ్‌మ్యాప్ ప్రకారం.. భారత్ 2047 నాటికి చంద్రునిపై ఓ క్రూ స్టేషన్‌ను నిర్మించాలనుకుంటోంది.