Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 7, 2026
Current Affairs
అగ్ని-3 పరీక్ష విజయవంతం
అగ్ని-3 పరీక్ష విజయవంతం
  • అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అగ్ని-3 బాలిస్టిక్‌ క్షిపణిని భారత్‌ 2026, ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపుర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రం పరిధి 3వేల కిలోమీటర్ల పైనేనని అధికారులు తెలిపారు. 
  • అధునాతన క్షిపణి అయిన అగ్ని-3.. ఇప్పటికే భారత సైనిక దళాల అమ్ములపొదిలో చేరింది. 1.5 టన్నుల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. దీని పొడవు 17 మీటర్లు. ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశలు ఇందులో ఉన్నాయి.