యుద్ధ సామర్థ్యాలను, సన్నద్ధతను చాటిచెప్పేలా రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారుల్లో భారత సైన్యం 2026, ఫిబ్రవరి 24న ‘అగ్ని వర్ష’ పేరుతో భారీ విన్యాసాలు నిర్వహించింది. సైన్యంలోని సదరన్ కమాండ్ బలగాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ విన్యాసాల్లో మానవరహిత గగనతల వాహనాలు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, ఆధునిక ఆర్టిల్లరీ ప్లాట్‌ఫాంలు, నిఘా వ్యవస్థలను ఎక్కువగా ప్రదర్శించారు. 25 దేశాలకు చెందిన విదేశీ పాత్రికేయులు వీటిని వీక్షించారు.