భారత వాయుసేన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు నాన్-కంబాటెంట్ నియామకానికి (ఇన్‌టేక్ 02/2026) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక వాయుసేన కేంద్రాలలో హాస్పిటాలిటీ అండ్ హౌస్‌కీపింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయచేయడానికి అర్హత గల అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
అగ్నివీర్ వాయు నాన్-కంబాటెంట్
విభాగాలు: హాస్పిటాలిటీ & హౌస్‌కీపింగ్
అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్/ 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హతలు ఉండాలి. కేవలం అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు ఉండాలి.
వయోపరిమితి: 21 సంవత్సరాలు మించకూడదు. 02.07.2005 నుంచి 02.01.2009 మధ్య జన్మించి ఉండాలి.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.30,000+ ఇతర అలవెన్సులు.
ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన, రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, ఎస్‌ఎస్‌టీ, వైద్య పరీక్ష తదితరాలు ఆధారంగా.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in నుంచి దరఖాస్తు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసి దరఖాస్తును పూరించి సంబంధిత ధ్రువపత్రాలతో కలిపి సాధారణ పోస్ట్ లేదా డ్రాప్‌బాక్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాయుసేన కేంద్రాలకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23.02.2026.
Website:https://agnipathvayu.cdac.in/