ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్), ఆన్ సియంగ్ (దక్షిణ కొరియా) టైటిళ్లు సాధించారు.
2025, జనవరి 19న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ అక్సెల్సెన్ 21-16, 21-8తో లీ చుక్ (హాంకాంగ్)పై నెగ్గి విజేతగా నిలిచాడు.
2017, 2019లలో టైటిళ్లు గెలిచిన అక్సెల్సెన్ ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి.
మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సియంగ్ 21-12, 21-9తో పోర్న్‌పావీ చోచువాంగ్ (థాయ్‌లాండ్)పై గెలుపొందింది.