Published on Apr 5, 2025
Current Affairs
అంక్టాడ్‌ - 2025 నివేదిక
అంక్టాడ్‌ - 2025 నివేదిక

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకునే సత్తా, సన్నద్ధత ఉన్న దేశాల్లో భారత్‌ 36వ స్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్యం, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్‌) 2025 సంవత్సర నివేదిక వెల్లడించింది.

170 దేశాలతో తయారైన ఈ జాబితాలో 2022లో 48వ స్థానంలో నిలిచిన భారత్‌ 2024లో 36వ ర్యాంక్‌కు ఎగబాకింది.

సమాచార, కమ్యూనికేషన్‌ సాంకేతికతలు (ఐసీటీ), పరిశోధన - అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి), నైపుణ్యాలు, పారిశ్రామిక సామర్థ్యం, నిధుల లభ్యతల ఆధారంగా ఏయే దేశాలు అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయో తెలిపే సూచీని అంక్టాడ్‌ రూపొందించింది.