మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో భిక్షాటన చేసేవారికి డబ్బులిచ్చేవారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని అక్కడి అధికారులు ప్రకటించారు.
2025 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఇందౌర్‌లో భిక్షాటనను నిషేధించారు.
యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది.
దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.