రోదసి నుంచి తిరిగొచ్చిన స్టార్‌షిప్ వ్యోమనౌకను దక్షిణ టెక్సాస్‌లో ప్రయోగ వేదికవద్ద ఉన్న భారీ యాంత్రిక హస్తాలు విజయవంతంగా గాల్లోనే ఒడిసిపట్టాయి. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇలా భద్రంగా సేకరించడం ఇదే మొదటిసారి.
దీంతో 22 గంటలపాటు సాగిన ఈ వ్యోమనౌక యాత్ర సాఫీగా ముగిసినట్లయింది. అయితే తొలి దశలోని బూస్టర్‌ను ఒడిసిపట్టలేకపోవడంతో.. రెండింటినీ ఈ పద్ధతిలో తిరిగి సేకరించి, ‘డబుల్ క్యాచ్’ను నమోదు చేద్దామనుకున్న స్పేస్‌ఎక్స్ లక్ష్యం నెరవేరలేదు.