Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 169
వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్): 42 పోస్టులు
2. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఎలక్ట్రికల్): 25 పోస్టులు
3. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్): 101 పోస్టులు
బ్యాక్లాగ్ ఖాళీలు:
1. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్): 01 పోస్టు
అర్హతలు: బీఈ/ బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఫైర్/ సేఫ్టీ & ఫైర్ ఇంజినీరింగ్/ ఫైర్ టెక్నాలజీ & సేఫ్టీ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.10.2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటరాక్షన్ ఆధారంగా; అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్-ఫైర్) పోస్టులకు అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా ఎస్బీఐ శాఖల్లో నియామకాలు ఉంటాయి.
ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 12.12.2024
Website:https://bank.sbi/web/careers/current-openings
Apply online:https://ibpsonline.ibps.in/sbiscooct24/