భారత రక్షణ విభాగాలు సముద్రం అడుగు భాగాన జరిపిన ‘మల్టీ ఇన్‌ఫ్లూయెన్స్ గ్రౌండ్ మైన్ (ఎంఐజీఎం) పరీక్ష విజయవంతమైందని కేంద్ర రక్షణ వర్గాలు 2025, మే 6న తెలిపాయి. స్వల్ప పరిమాణంలో పేలుడు పదార్థాలతో సముద్ర జలాల అంతర్భాగంలో పేలుడు జరపడం వీటి ప్రత్యేకత. దీన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత నౌకాదళాలు సంయుక్తంగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేశాయి.