హైదరాబాద్, బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్ రూం- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), 2025-26 విద్యా సంవత్సరానికి కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం): 60 సీట్లు
2. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ): 60 సీట్లు
3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్‌ఈ): 60 సీట్లు
4. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ): 60 సీట్లు
వ్యవధి: డీటీడీఎం కోర్సుకు నాలుగేళ్లు మిగిలిన కోర్సులకు మూడేళ్లు.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: 22-05-2025 నాటికి 15 నుంచి 19 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.800; ఎస్సీ/ ఎస్టీలకు రూ.400.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ /ఆన్‌లైన్ మోడ్ ద్వారా.
ప్రవేశ పరీక్ష విధానం: పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 10వ తరగతికి సంబంధించి మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష వ్యవధి: ఒకటిన్నర గంటలు.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 22-05-2025.
ప్రవేశ పరీక్ష తేదీ: 25-05-2025.
ప్రవేశ పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
Website:https://citdindia.org/diploma-admissions-2024.php
Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLScBz2IznqT3iIwxTlJe9wBOykimzHTp-hgxDSf8DVHuJLkyAw/viewform