Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Oct 24, 2026
Current Affairs
శాసనాల లిపికి ఏఐ
శాసనాల లిపికి ఏఐ
  • తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో లభ్యమవుతున్న పురాతన శాసనాలు, తాళపత్రాలు, చిహ్నాల్లోని లిపిని గుర్తించి, అర్థం చేసుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏఐను వినియోగించేలా ఓ ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పటికే తమిళ్‌ సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌తో పాటు మెషీన్‌ లెర్నింగ్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ సాంకేతికతల్ని తీసుకొచ్చారు.

  • దీనికి అదనంగా ఎంజీఆర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ‘కల్వీట్టు ఏఐ’ టూల్‌ను, ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధకులు ప్రాచీన తమిళ అక్షరాల నమూనాలతో ‘తమిళి’ డేటాసెట్‌ను తెచ్చారు. వీటన్నింటినీ ఏఐకి అనుసంధానించారు. తమిళుల చరిత్ర, భాష మూలాలు తెలుసుకునేందుకు దీన్ని చేపట్టింది.