Published on Oct 21, 2025
Current Affairs
వాణిజ్య లోటు రూ.13.64 లక్షల కోట్లు
వాణిజ్య లోటు రూ.13.64 లక్షల కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధ భాగం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో 24 దేశాలకు మన ఎగుమతుల్లో వృద్ధి నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధిక టారిఫ్‌ల వల్ల 2025 సెప్టెంబరులో అమెరికాకు మాత్రం మన ఎగుమతులు తగ్గాయని పేర్కొంది. మన ఎగుమతులు పెరిగిన 24 దేశాల్లో కొరియా, యూఏఈ, జర్మనీ, టోగో, ఈజిప్ట్, వియత్నాం, ఇరాక్, మెక్సికో, రష్యా, కెన్యా, నైజీరియా, కెనడా, పోలండ్, శ్రీలంక, ఒమన్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, బ్రెజిల్, బెల్జియం, ఇటలీ, టాంజానియా తదితర దేశాలున్నాయి. ఈ 24 దేశాలకు 129.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11.37 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు జరిగాయి. మొత్తం మన ఎగుమతుల్లో ఈ దేశాల వాటా 59%.