రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్), తెలంగాణ రాష్ట్రం రామగుండం, నోయిడా కార్పొరేట్ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
వివరాలు:
కెమికల్: 18
మెకానికల్: 03
ఎలక్ట్రికల్: 03
ట్రాన్స్‌పోర్టెషన్: 01
హ్యూమన్ రిసోర్స్: 02
మెడికల్: 02
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 06
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 01
పోస్టులు: ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంజినీర్, ఆఫీసర్, ఆఫీసర్ సెక్రటేరియల్, అడిషనల్ సీఎంఓ, సీఎంఓ, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఎంబీబీఎస్, సీఏ/సీఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: ఇంజినీర్‌కు రూ.40,000- రూ.1,40,000; అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; అడిషనల్ సీఎంఓకు రూ.70,000- .2,00,000; సీఎంఓకు రూ.80,000- రూ. 2,20,000; చీఫ్ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000.
వయోపరిమితి: ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, అసిస్టెంట్/డిప్యూటీ మేనేజర్లకు 40 ఏళ్లు; అడిషనల్ సీఎంఓకు, సీఎంఓకు 45 ఏళ్లు; చీఫ్ మేనేజర్‌కు 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తయ్యాక ప్రింట్ తీసుకొని అవసరమైన ధ్రువపత్రాలతో నోయిడా కార్పొరేట్ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.700- రూ.1000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్విస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 24.09.2026
హార్డ్ కాపీలు పంపించడానికి చివరి తేదీ: 01.10.2026
Website:https://www.rfcl.co.in/