Published on Oct 21, 2025
Current Affairs
యునెస్కో నివేదిక
యునెస్కో నివేదిక

ప్రపంచవ్యాప్తంగా నేటికీ 133 మిలియన్ల (13.9 కోట్లు) మంది బాలికలకు చదువు అందట్లేదని యునెస్కో లింగ సాధికారత కొలమానం (జీఈఎం) తేల్చింది.

విద్యతోసహా అన్ని అంశాల్లోమహిళలు పూర్తిగా, సమానంగా పాల్గొనడమే లక్ష్యంగా 1995లో యునెస్కో ‘బీజింగ్‌ డిక్లరేషన్‌’ చేసింది.

ఈ 30 ఏళ్లలో లక్ష్యాన్ని సాధ్యమైనంతగా సాధించినప్పటికీ, తాజా ప్రకటనతో ఇంకా ఎంత మందికి విద్య అందట్లేదో స్పష్టమెంది.

ప్రాథమిక, మాధ్యమిక విద్యలో బాలురు, బాలికల నిష్పత్తి సమానంగా ఉంది.

దక్షిణ, మధ్య ఆసియాల్లో మాధ్యమిక విద్యలో సమానత్వం నమోదైంది.

ఆఫ్రికా ఇంకా వెనుకబడి ఉన్నట్లు పేర్కొంది.