Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Apr 23, 2026
Current Affairs
మహిళల అభివృద్ధి కార్యక్రమం
మహిళల అభివృద్ధి కార్యక్రమం
  • ఫిఫా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మహిళల అభివృద్ధి కార్యక్రమం’ కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారత్‌కు చోటు దక్కింది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) సమర్పించిన వాణిజ్య వ్యూహాలు, భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలించిన అనంతరం ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడెన్, స్కాట్లాండ్, కెనడా, మెక్సికో, ఫిన్లాండ్, ఘనా, జోర్డాన్, లిథువేనియా, పరాగ్వే దేశాలు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. 
  • ఈ శిక్షణ కార్యక్రమం 2026, మే నుంచి అక్టోబరు వరకు ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతుంది. భారత మహిళల ఫుట్‌బాల్‌ రంగానికి చెందిన వివిధ భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా ఫిపా ఈ కోర్సును రూపొందించింది.