మానవాభివృద్ధి సూచీ 2023లో భారత్ 130వ స్థానంలో నిలిచినట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమ (యూఎన్‌డీపీ) మానవాభివృద్ధి నివేదిక 2025, మే 6న వెల్లడించింది.
ఈ సూచీలో మొత్తం 193 దేశాలున్నాయి. 2022లో మన దేశం 133వ స్థానంలో ఉంది.
2022లో అసమానతల కారణంగా భారత్‌లో మానవాభివృద్ధి 30.7 శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
దేశంలో వైద్య, విద్య రంగాల్లో అసమానతలు మెరుగుపడినా ఆదాయ అసమానతలు, లింగ వివక్ష గణనీయంగా ఉన్నాయని నివేదిక తెలిపింది.
శ్రామిక వర్గంలో మహిళల భాగస్వామ్యం, మహిళల రాజకీయ ప్రాతినిధ్యం వంటి విషయాల్లో దేశం వెనుకబడి ఉంది.