భారత్, స్విట్జర్లాండ్ మధ్య వలసలు-మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత ఎగుమతిదార్లకు స్విస్ మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించారు. అణు విద్యుత్, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోడానికి రెండు దేశాలు అంగీకరించాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, స్విస్ అధ్యక్షుడు జీ పార్మెలిన్ మధ్య చర్చల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం స్విస్ అధ్యక్షుడు 2026, అక్టోబరు 5న మనదేశానికి వచ్చారు.