Published on May 7, 2025
Current Affairs
భారత వృద్ధి 6.3 శాతమే
భారత వృద్ధి 6.3 శాతమే

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.5% నుంచి 6.3 శాతానికి మూడీస్‌ రేటింగ్స్‌ తగ్గించింది. అమెరికా వాణిజ్య విధానాల్లో అనిశ్చితి, టారిఫ్‌ల వల్ల ప్రపంచ దేశాల వృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల వల్లా భారత వృద్ధిపై ప్రభావం చూపుతుందని తెలిపింది. 2026-27 వృద్ధి అంచనాలను 6.5 శాతంగా సంస్థ కొనసాగించింది. వృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఆర్‌బీఐ మరిన్ని రేట్ల కోతలు విధించొచ్చని అభిప్రాయపడింది.