Published on May 7, 2025
Current Affairs
భారత్, బ్రిటన్‌ మధ్య ఒప్పందం
భారత్, బ్రిటన్‌ మధ్య ఒప్పందం

భారత్, బ్రిటన్‌ మధ్య 2025, మే 6న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. దీంతో భారత్‌ నుంచి కార్మికులు అధికంగా పనిచేసే తోలు వస్తువులు, పాదరక్షలు, దుస్తులు, ప్రాసెస్డ్‌ ఆహారోత్పత్తుల లాంటి ఎగుమతులకు ఊతం లభించనుంది. బ్రిటన్‌ నుంచి విస్కీ, కార్లు, వైద్య పరికరాల దిగుమతి చౌకగా మారనుంది. తాజా ఎఫ్‌టీఏ కారణంగా ద్వైపాక్షిక వాణిజ్యం 2030 కల్లా 120 బి. డాలర్లకు చేరొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 2022 జనవరి నుంచి 14 దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.

భారత్, బ్రిటన్‌ దేశాలు ప్రస్తుతం ప్రపంచంలో అయిదో, ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలగా ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఎఫ్‌టీఏతో పాటు డబుల్‌ కాంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ (డీసీసీ)/సామాజిక భద్రతా ఒప్పందం కూడా కుదిరింది.