న్యూదిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కైన్సిల్ ( బీఐఆర్‌ఏసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 3
వివరాలు:
అసోసియేట్ కన్సల్టెంట్ (పేటెంట్ అనలిస్ట్): 02
అసోసియేట్ కన్సల్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీకాం, ఎంబీఏ/ పీజీడీఎం(ఫైనాన్స్), ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.75,000.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-03-2025.