Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Oct 24, 2026
Current Affairs
పారా ఆసియా క్రీడలు
పారా ఆసియా క్రీడలు
  • జపాన్‌లోని నగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడలను భారత్‌ 2026, అక్టోబరు 23న ముగించింది. ఇప్పటికి 114 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అక్టోబరు 24న పోటీల చివరి రోజు. కానీ భారత అథ్లెట్లెవరూ బరిలో లేరు. భారత్‌ రికార్డు స్థాయిలో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు గెలుచుకుంది. ఈసారి భారత్‌ 168 మంది అథ్లెట్లతో పారా ఏషియాడ్‌లో బరిలోకి దిగింది.

  • భారత షట్లర్లు అక్టోబరు 23న దేశానికి మూడు స్వర్ణాలు అందించారు. పురుషుల సింగిల్స్‌లో పారిస్‌ పారాలింపిక్‌ ఛాంపియన్‌ నితేశ్‌ కుమార్, నవీన్‌ శివకుమార్‌ టైటిళ్లు గెలుచుకున్నారు. ఎస్‌ఎల్‌3 ఫైనల్లో నితేశ్‌ 21-18, 21-16తో మన దేశానికే చెందిన ప్రమోద్‌ భగత్‌పై విజయం సాధించగా.. నవీన్‌ 21-9, 21-17తో ఫ్రెడే సెతియావాన్‌ (ఇండోనేసియా)ను ఓడించాడు. తులసిమతి, మానసి జోషి జంట మహిళల డబుల్స్‌ (ఎస్‌ఎల్‌3-ఎస్‌యూ5)లో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ ద్వయం ఫైనల్లో 21-16, 21-13తో యాంగ్, జియావో (చైనా) జోడీపై గెలిచింది.