దేశంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం 2023-24 నాటికి రూ.4.14 లక్షల కోట్లకు చేరుకుంది. 2013-14లో ఇది రూ.1.30 లక్షల కోట్లుగా ఉంది. అంటే మూడు దాదాపు 3 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో ప్రజల జేబు నుంచి ఆరోగ్యానికి అయ్యే వ్యయం 21.5 శాతం తగ్గింది. జాతీయ ఆరోగ్య ఖాతాల (ఎన్‌హెచ్‌ఏ) అంచనా ఈ వివరాలను వెల్లడించింది. దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది.
ప్రజల జేబుల నుంచి అయ్యే వ్యయం 2013-14లో 64.2 శాతం ఉండగా.. 2023-24 నాటికి అది 42.7శాతానికి తగ్గిపోయింది.