భారత అమ్మాయి అనుపమ రామచంద్రన్ మహిళల ప్రపంచ స్నూకర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2025, నవంబరు 13న దోహాలో జరిగిన ఫైనల్లో చెన్నైకి చెదిన అనుపమ 3-2తో మూడుసార్లు ఛాంపియన్ ఆన్ యీ (హాంకాంగ్)ను ఓడించింది.
ప్రపంచ స్నూకర్ టైటిల్ (15-రెడ్) సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా అనుపమ ఘనత సాధించింది. 2024లో ఆమె ఆసియా స్నూకర్ టైటిల్ గెలిచింది.