సతత హరితారణ్యాలు ఎక్కువగా విస్తరించిన భూభాగాన్ని వర్షారణ్యాలు అంటారు. ఇవి అత్యంత పురాతన జీవావరణ వ్యవస్థలను కలిగి, ప్రపంచంలోని సగానికిపైగా వృక్ష, జంతు జాతులకు నిలయాలుగా ఉన్నాయి. వర్షారణ్యాల వల్ల భూగోళానికి, జీవవైవిధ్యానికి కలిగే ప్రయోజనాలను తెలిపే లక్ష్యంతో ఏటా జూన్ 22న ‘ప్రపంచ వర్షారణ్య దినోత్సవం’గా (World Rainforest Day) నిర్వహిస్తారు. వర్షారణ్యాల ప్రాధాన్యం, ఉపయోగాలు, నిర్మూలించడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం