Published on Nov 14, 2025
Walkins
న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ పోస్టులు
న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ పోస్టులు

న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ బెంగళూరు (ఎన్‌ఎస్‌ఐఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ఇంజినీర్స్‌, అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 47

వివరాలు:

1. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌: 22

2. ప్రాజెక్ట్ ఇంజినీర్స్‌: 15

3. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 10

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 35 ఏళ్ల నుంచి 45 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు రూ.72,800, ప్రాజెక్ట్‌ ఇంజినీర్స్‌కు రూ.60,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.30,000. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 నవంబర్‌ 30.

Website:https://www.nsilindia.co.in/career