హిమాలయ దేశం నేపాల్ భీకర వరదలకు గురైంది. నేపాల్, టిబెట్ సరిహద్దులోని భోటే కోషి నది నుంచి 2026, ఆగస్టు 26న ఒక్కసారిగా వరద పోటెత్తింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, ధాడింగ్ జిల్లాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహు, నవాల్‌పారసీ తూర్పు జిల్లాలను ముంచెత్తింది. మొత్తంగా 7 జిల్లాలు దెబ్బతిన్నాయి. 160 మంది మృతి చెందగా, 750 మందికిపైగా గల్లంతయ్యారని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 133 మంది భారతీయులే ఉన్నారు.
టిబెట్‌లో 265 మంది కనిపించకుండా పోయారు. ముగ్గురు మరణించారు.