Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Oct 24, 2026
Current Affairs
‘నాగాస్త్ర-2’ ఆత్మాహుతి డ్రోన్లు
‘నాగాస్త్ర-2’ ఆత్మాహుతి డ్రోన్లు

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ సంస్థ రూపొందించిన ‘నాగాస్త్ర-2’ అనే ట్యాంకు విధ్వంసక డ్రోన్లను భారత సైన్యానికి అప్పగించింది. గాల్లో చక్కర్లు కొడుతూ ఆత్మాహుతి దాడితో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. ఇందులో పగలు, రాత్రి నిఘా పెట్టగల అత్యాధునిక కెమెరాలు ఉన్నాయి. 4 కిలోల శక్తిమంతమైన ట్యాండమ్‌ షేప్డ్‌-ఛార్జ్‌ వార్‌హెడ్‌ ఉంటుంది.